..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ అందజేత
అమరావతి :
ఏపీ రాష్ట్రంలో పింఛన్ తీసుకునే వారికి శుభవార్త. ఎన్టీఆర్ భరోసా పింఛన్ను ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఇవ్వనుంది. జూన్ 1న ఆదివారం కావడంతో మే 31న ఉ.7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తారు. స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి రూ.4 వేల చొప్పున పింఛన్ అందజేయనున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై
నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడనుంది.
