మండలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్రాగునీరు సరఫరా

భారత్ న్యూస్ అనంతపురం ..మండలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్రాగునీరు సరఫరా

రెండు నెలల నుండి రెండు పూటలా పూటకు 20వేల లీటర్లు,రెండు పూటలా రోజుకు 40000 లీటర్ల మంచినీటి సరఫరా కార్యక్రమం

కోడూరు మండలం ఇరాలి, బసవనిపాలెం, రామకృష్ణాపురం గ్రామాలలో మంచినీటిని సరఫరా చేస్తున్న మన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు

తీర గ్రామాల దాహం తీర్చేందుకు నలభై వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం కోడూరు మండలం ఇరాలి, బసవనిపాలెం, రామకృష్ణాపురం గ్రామాలకు త్రాగునీరు అందచేశారు.
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, తన తండ్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు గారి మండలి ఫౌండేషన్ జ్ఞాపకార్ధం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండలి ఫౌండేషన్ ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ గారు పర్యవేక్షించారు.