..భారత్ న్యూస్ హైదరాబాద్….సూర్యాపేటలో శిశు విక్రయాల ముఠా అరెస్ట్
సూర్యాపేటలో శిశు విక్రయాల ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు 13 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి చెర నుంచి 10 మంది చిన్నారులను క్షేమంగా బయటకు తెచ్చారు. వారిలో ఏడుగురు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. చిన్నారులందరినీ నల్గొండ బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. మొత్తం 28 మంది శిశువులను ఆ గ్యాంగ్ విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. సూర్యాపేటకు చెందిన కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్న దంపతులు శిశు విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు.
