ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలకు సర్కార్ రంగం సిద్ధం…

భారత్ న్యూస్ అనంతపురం .. ..ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలకు సర్కార్ రంగం సిద్ధం…

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది.

జిల్లాల్లోనీ అధికారుల పనితీరుపై నిఘా వర్గాల ద్వారా పూర్తి సమాచారం సేకరించిన సర్కార్..

అన్ని కోణాలలో అధికారుల వ్యవహారశైలీలపై పూర్తి సమాచారం సేకరించిన అనంతరం తదనుగుణంగా సర్కార్ చర్యలు రంగం సిద్ధం..

గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పై వేటు వేయడం వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్లు చేయడం కూటమి సర్కార్ హయాంలో మొదలయ్యాయి..

తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది సివిల్ సర్వీసెస్ అధికారులు హైదరాబాదులో రహస్య సమావేశమయ్యారనే దానిపై కూటమి సర్కార్కు పూర్తి సమాచారం సేకరించినట్లు సమాచారం. కానీ కూటమి సర్కార్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లో సమర్ధులకు స్ధానం కల్పించాలని కూటమి సర్కార్ నిర్ణయం..

ఆ మేరకు పలు వడపోతల అనంతరం ఒక ప్రాథమిక జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం..

రాష్ట్రంలోని దాదాపు 12 నుంచి 14 మంది ఎస్పీలు బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్రంలో 6గురు డిఐజిలకు కూడా బదిలీ జాబితాలో ఉన్నట్లు సమాచారం.

నలుగురు ఐజిలకు సర్కార్ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం..

గుంటూరు, ఏలూరు రేంజ్ లకు కొత్త పోలీస్ బాస్లు రానున్నట్లు సమాచారం.

అదేవిధంగా విశాఖపట్నం కమీషనర్ మార్పు కూడా ఉండనున్నట్లు సమాచారం.

ఈ బదిలీల ప్రక్రియలో ఒక రిటైర్డ్ డిజిపి చక్రం తిప్పుతున్నట్లు బోఘట్ట.