భారత్ న్యూస్ అనంతపురం ..అమరావతి :
ఏపీలో గర్భిణులకు గుడ్ న్యూస్..ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకం
పునఃప్రారంభం

ఏపీ ప్రభుత్వం గర్భిణులకు శుభవార్త చెప్పింది. 2014-2019లో ప్రజాదరణ పొందిన ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీంని మళ్లీ అమలు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేయగా, మళ్లీ పునః ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దోమ తెర, బేబీ డ్రెస్, నేప్కిన్స్, టవల్ సహా 11 రకాల వస్తువులతో కూడిన బేబీ కిట్ను గర్భిణులకు అందించనుంది.
ఇందుకోసం రూ.51.14 కోట్లు విడుదల చేశారు. ఒక్కో కిటికి రూ.1410 ఖర్చు చేయనున్నారు.