మస్కట్ దేశంలో నరకయాతన అనుభవిస్తున్న బాధితురాలు
పాకాల.( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి గ్రామానికి చెందిన పి.సుజాత మస్కట్లో చిరుకొని నరకయాతన అనుభవిస్తోంది.బతువు దెరువు కోసం ఏజెంట్ ద్వారా మస్కట్ కు వెళ్ళిన సుజాత సేటు వద్ద చిక్కుకొని నరకయాతన అనుభవిస్తున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేశారు.సుజాతాను ఇండియా డబ్బులు ప్రకారం 4 లక్షల రూపాయలకు అక్కడ సేటుకు అమ్మేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.ఈమె గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది అని కుటుంబ సభ్యులు తెలిపారు.గత రెండు నెలలుగా తనకు జీతం కూడా ఇవ్వడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా వేధిస్తున్నారని,టార్చర్ పెడుతున్నారని బాధితురాలు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.ఇండియా నుంచి మస్కట్ కు పంపిన ఏజెంట్లు స్పందించక పోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో సుజాత చిక్కుకుంది.కుటుంబ సభ్యులు సుజాత గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుజాతను పంపించిన ఏజెంట్ పై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.కాకినాడకు చెందిన ఏడుకొండలు,వేణుబాబు అనే ఏజెంట్ల వివరాలు తెలిపింది.తనను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.Polakala Sujatha
W/o P Muniraju
Kavalivaripalli
Adhar Number: 8095 7035 6660
Passport: V4311640
