భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్లో భారీగా బంగారు నిల్వలు!
ఏపీలోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జొన్నగిరి, రామగిరి, జవ్వకుల, చిగురుకుంట బిస్నాతం అనే 4 ప్రాంతాలలో బంగారం తవ్వకాలకు అనుకూలమైన అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. “కేవలం జొన్నగిరిలోనే 50 టన్నుల బంగారం అందుబాటులో ఉందని మా అంచనా,” అని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రాబోయే రోజుల్లో దేశానికి అత్యధికంగా బంగారాన్ని అందించే రాష్ట్రంగా ఏపీ మారనుందని చెబుతున్నారు.
