భారత్ న్యూస్ గుంటూరు…..రాజధాని అమరావతితో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరిం చిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ సంస్థకు రూ.2400 కోట్ల బకాయిలు ఉన్నట్టు ఆ సంస్థ సీఎండీ పుల్లారెడ్డి తెలిపారు. సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, టెక్నికల్ డైరక్టర్ ఆవుల మురళీ కృష్ణయాదవ్ గురువారం గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీడీసీఎల్ పరిఽధిలో ఎక్కువగా గ్రానైట్, ఆక్వా, స్పిన్నింగ్ మిల్స్ తదితర భారీ పరిశ్రమలు ఉండటంతో బకాయిలు పేరుకుపోయాయన్నారు. రికవరీకి చర్యలు తీసుకుంటు న్నామని వెల్లడించారు. పీఎం సూర్యఘర్ పథకం అమలుకు లక్ష్యాలు నిర్దేశించామని చెప్పారు. ఈ నెలలో 75 వేలు పీఎం సూర్యఘర్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. పీఎం సూర్యఘర్ కోసం రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు సబ్ స్టేషన్ స్థాయిలో 33 కేవీ, 11 కేవీ ఇతర లైన్లను తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
