భారత్ న్యూస్ నల్గొండ….రైతు భరోసా డబ్బులు పడ్డాయా?.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!…
తెలంగాణ : రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమయ్యాయో లేదో అధికారిక పోర్టల్ rythubharosa.telangana.gov.in వెబ్సైచ్లో సులభంగా తెలుసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్లి Know Your Bharosa Statusపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ లేదా పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ నమోదు చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే చెల్లింపు వివరాలు కనిపిస్తాయి. అలాగే బ్యాంక్‌కు లింక్ అయిన మొబైల్‌కు వచ్చిన డీబీటీ మెసేజ్, గూగుల్ పే, ఫోన్‌పే, యోనో వంటి యాప్‌లలో మినీ స్టేట్మెంట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. పెండింగ్‌గా ఉంటే గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించవచ్చు…..
