భారత్ న్యూస్ హైదరాబాద్ …శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళలు అరెస్ట్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు.
తనిఖీల్లో భాగంగా వీసాలు నకిలీవని తేలడంతో, వారిని పోలీసులకు అప్పగించారు.

ప్రస్తుతం ఎయిర్‌పోర్టు పోలీసులు ఈ మహిళలను విచారిస్తున్నారు.