జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే.. రైల్వేస్, ఆధార్, పాస్‌పోర్ట్‌లలో కీలక మార్పులు

భారత్ న్యూస్ హైదరాబాద్ …జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే.. రైల్వేస్, ఆధార్, పాస్‌పోర్ట్‌లలో కీలక మార్పులు

ఆధార్ :- ఆధార్‌తో ఈ మెయిల్ లింక్ చేసుకోవడం లేదా అప్‌డేట్ చేసుకోవడాన్ని ఉచితం చేస్తూ ‘ద యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యుఐడీఏఐ)’ నిర్ణయం తీసుకుంది. గతంలో దీనికి రూ.75 ఛార్జీ వసూలు చేసేవారు. ఇప్పుడు జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉచితంగా ఈ సర్వీస్ వాడుకోవచ్చు.

పాస్‌పోర్ట్‌ ధరల పెంపు :- జూలై 1 నుంచి పాస్‌పోర్ట్‌ ఫీజుల్ని కేంద్రం పెంచింది. 14 ఏళ్ల తర్వాత ఈ ఫీజుల ధరల్ని కేంద్రం సవరించింది. దీని ప్రకారం.. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు గతంలో రూ.1,500 ఫీజు ఉండగా, ఇప్పుడు రూ.2,500 చెల్లించాలి. తత్కాల్‌ పాస్‌పోర్ట్‌కు గతంలో రూ.3,500 ధర ఉండగా, ఇప్పుడు రూ.5,000 చెల్లించాలి. ఇతర ఫీజుల్లో కూడా మార్పులు చేసింది.

రైళ్లలో టిక్కెట్ లేకుంటే ఫీజు రెట్టింపు :- రైళ్లలో టిక్కెట్ లేకుండా చేసే ప్రయాణానికి సంబంధించి ఫీజును కూడా రైల్వే శాఖ రెట్టింపు చేసింది. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే ఇంతకుముందు రూ.250 ఫీజు ఉండేది. ఇప్పుడు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.