భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో భారీ వర్షాలు!!!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జూలై 3న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానంలో నైరుతి గాలులు వీస్తున్నాయి.

జూలై 2న ఉత్తరకోస్తా, యానంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు వచ్చే ప్రమాదం ఉంది…