ఆగస్టు 30న నీట్ పీజీ పరీక్ష

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఆగస్టు 30న నీట్ పీజీ పరీక్ష

పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(పీజీ)-2026 పరీక్ష ఆగస్టు 30న జరగనుంది. జులై 1 నుంచి మొదలైన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 21న రాత్రి 11.55 గంటల వరకు కొనసాగనుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఈ పరీక్షను నిర్వహించనుంది. సెప్టెంబర్ 30లోపు ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉంది. ఇక ఇటీవల నీట్ రీఎగ్జామ్ పూర్తికాగా రిజల్ట్స్ వెలువడాల్సి ఉంది.