కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఉపాధి హామీ పని పథకం దినములు

భారత్ న్యూస్ఏలూరు జిల్లా ముదినేపల్లి:::::::::::కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఉపాధి హామీ పని పథకం దినములు పెంపుపై శుభాకాంక్షలు తెలియజేసిన చల్లగుళ్ళ శోభనాద్రి చౌదరి ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు పని దినములు పెంచి,వేతనాన్ని పెంపుదలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి ముఖ్య అతిధిగా పాల్గొని ఉపాది హామీ కూలీలనుద్దేశించి మాట్లాడుతూ “గ్రామీణ కుటుంబాలకు ఎక్కువ ఉపాధి, మెరుగైన ఆదాయం, శాశ్వత గ్రామాభివృద్ధి—ఈ మూడు లక్ష్యాలతో వి.బి.–జి.రాం.జీ పధకంతో అమలు అవుతోందని, ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని,మన గ్రామాల్లో చెరువులు, రోడ్లు, నీటి సంరక్షణ పనులు, శాశ్వత ఆస్తులు నిర్మించడమే లక్ష్యంగా,మనం
ఈరోజు చేసే పని రేపటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలనే ఆలోచనతొ 100 రోజుల ఉపాధి హామీ ఇప్పుడు 125 రోజులకు పెంచారని రోజువారీ కూలీ సగటున 10% పైగా పెరిగిందని కనీస వేతనం కూడా ₹300 కంటే తక్కువ కాకూడదని కేంద్రప్రభుత్వం ప్రకటించిందని ప్రభుత్వానికి ఈ పథకానికి ₹95,692 కోట్ల భారీ బడ్జెట్ నిధులని కేటాయించారని, గ్రామాల్లో రోడ్లు, చెరువులు, నీటి సంరక్షణ, ఇతర శాశ్వత ఆస్తుల నిర్మాణంపై ఎక్కువ దూరా దృష్టితొ ప్రజలకు మేలుజరిగేలా ఎన్.డీ.ఏ.ప్రభత్వం ప్రజల శ్రేయస్సుకోసం అమలుచేసిందని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలన్న లక్యం తో ఉపాధి పని దినములు పెంచి,కూలి రేటుకూడా పెంచారని, పాత జాబ్ కార్డులు, ఇప్పటికే కొనసాగుతున్న పనులు కొనసాగుతాయి కొత్త పథకానికి మార్పు వల్ల లబ్ధిదారులు చేస్తున్న పని ఆగదని చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి అన్నారు ఈకార్యక్రమంలో ఏం.పి.డీ.ఓ. రామకృష్ణ,ఉపాధి హామీ మండల అధికారి హేమంబర్దరావు,ఫీల్డ్ అసిస్టెంట్ ప్రకాష్,ఉపాధి హామీ (మెట్) మేస్త్రి తిరువీధుల వెంకటలక్ష్మి,ఉపాధి హామీ కూలీలు పాల్గొని భూమి పూజ,ఆయుధ పూజ చేసి ప్రార్ధనలు చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేశారు.