భారత్ న్యూస్ విశాఖపట్నం..లోకేష్ పేరు ఎత్తే అర్హత బియ్యం దొంగకు లేదు : కనపర్తి
మంత్రి నారా లోకేష్ పేరు ఎత్తే కనీస అర్హత చిడతల అప్పారావుగా పేరు గాంచిన బియ్యం దొంగ పేర్ని నానీకి లేదని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. దొంగ బియ్యం కేసులో తన భార్యను అడ్డు పెట్టుకొని జైలుకి వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతూ ఇతరులపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అవనిగడ్డ పార్టీ కార్యాలయంలో కనపర్తి విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా రప్పా , రప్పా అంటూ నరికేసినా వారికి ఇంకా సిగ్గు రాలేదని అన్నారు. ఇలాంటి భాష మాట్లాడి నందుకే జగన్ ముఠాను ప్రజలు అసహ్యించుకున్న వారిలో మార్పు రాక పోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్ట పరిచి, పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని వైకాపా నేతలు కుట్ర పన్నారని అన్నారు. ఎంత రెచ్చగొట్టినా పోలీసులు తమను అరెస్టు చేసి కేసులు పెట్టటం లేదన్న మనో వేధన వైకాపా అగ్ర నేతల్లో కనబడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల కూటమి ప్రభుత్వానికి సహకరించటమే కాక తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, నిరుద్యోగులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇవ్వటం, భారీగా పరిశ్రమలు రావడం, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టడం లాంటి పథకాలతో జగన్ కు లండన్ మందులు పనిచేయక నిద్రలేని రాత్రులను గడుపుతున్నాడని అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు, లోకేష్ లను బయటకు రాకుండా వారిపై దాడులు చేయించటం, వారి కుటుంభ సభ్యులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం లాంటి నీచమైన పనులకు పాల్పడబట్టే వారికి ఈ గతి పట్టిందని అన్నారు. నాని, అంబటి రాంబాబు లాంటి పిట్టల దొరల మాటలకు తెలుగుదేశం కార్యకర్తలెవరూ భయపడరని, మంత్రి నారా లోకేష్ పేరెత్తితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కనపర్తి హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి కర్రా సుధాకర్ మండల పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, జనార్ధనరావు, మెండు లక్ష్మణరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
