కేంద్రమంత్రికి రూ.99 లక్షల సబ్సిడీ.. దోసకాయల సాగుకోసం రాయితీ పొందిన భగీరథ్

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్రమంత్రికి రూ.99 లక్షల సబ్సిడీ.. దోసకాయల సాగుకోసం రాయితీ పొందిన భగీరథ్

🔹కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి భగీరథ్‌ చౌదరి రాజస్థాన్‌లో తన దోసకాయల సాగు కోసం రూ.99 లక్షలకుపైగా మొత్తాన్ని సబ్సిడీగా పొందారు. ఈ రాయితీని ఆయన తాను ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న బోర్డు నుంచే పొందడం విశేషం. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రచురించిన కథనంలోని వివరాల ప్రకారం కూచామన్‌ జిల్లా, పీహ్‌ గ్రామంలో ‘నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డ్‌(ఎన్‌హెచ్‌బీ), వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం వారి సహాయంతో’ అనే బోర్డు కలిగిన ఒక విస్తారమైన వ్యవసాయ క్షేత్రం ఉంది. దానిపై లబ్ధిదారుని పేరు దగ్గర ‘మిస్టర్‌ భగీరథ్‌ చౌదరి’ అని, సబ్సిడీ మొత్తం 50శాతం(రూ.99, 60,000) అని స్పష్టంగా రాసి ఉంది

🔹నిరుడు దేశవ్యాప్తంగా అమోదం పొందిన 467 ప్రాజెక్టులలో మంత్రి ప్రాజెక్టు ఒకటి కావడం విశేషం. కేంద్ర మంత్రికి రాయితీ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తిన వేళ భగీరథ్‌ చౌదరి ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ తాను మంత్రి కాకముందే తన దోసకాయల సాగు ప్రాజెక్టు కోసం ప్రభుత్వ పథకం కింద రూ.99.03 లక్షల సబ్సిడీని పొందినట్లు తెలిపారు. ఈ విషయంలో తానేమీ దాచలేదని, తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. కాగా ఈ ఉదంతంపై కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా ‘ఎక్స్‌’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘ధర్మం ఇంటి నుంచే మొదలవుతుందంటారు.