వెలిగొండ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికిన విక్కుర్తి.

భారత్ న్యూస్ రాజమండ్రి…వెలిగొండ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికిన విక్కుర్తి.

Ammiraju Udaya Shankar.sharma News Editor…మార్కాపురం జిల్లా పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును శనివారం సందర్శించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాస పరిహారం పంపిణీ, పనుల గడువు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులను స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు ముంపు బాధితుల కోసం 905 కోట్ల పునరావాస ప్యాకేజీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, అందులో మొదటి విడతగా 300 కోట్ల పరిహారం చెక్కులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఆయా కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారులతో కలిసి విక్కుర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.

తొలుత హెలీఫ్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకు విక్కుర్తి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో వివిధ అంశాలపై విక్కుర్తి కొద్దిసేపు ముచ్చటించారు.