భారత్ న్యూస్ హైదరాబాద్ …2030కి ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్… ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే!
మారుతున్న జీవనశైలి, కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా భారత్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఎయిమ్స్ (AIIMS), ఐసీఎంఆర్ (ICMR) హెచ్చరించాయి. ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, 2030 నాటికి ఏటా 15.7 నుంచి 20 లక్షల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపాయి. పొగాకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, పోషకాహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేయడం, మహిళలు క్రమం తప్పకుండా బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం, అలాగే తగిన హెల్త్ ఇన్సూరెన్స్, అత్యవసర నిధి సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
