భారత్ న్యూస్ ఢిల్లీ…..షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరైన పహల్గాం మాస్టర్మైండ్, లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు
ఇస్లామాబాద్ లో జరిగిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలకు లష్కరే తయ్యిబా(LeT) ఉగ్రవాదులు హాజరైనట్లు ఓ వీడియో బయటపడటంతో వివాదం చెలరేగింది.

హాజరైన వారిలో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరితో పాటు, హాఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ కూడా ఉన్నారు. LeT రాజకీయ విభాగమైన పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహమాన్ కూడా ఈ అంత్యక్రియలకు వచ్చాడు….