తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో యాసిడ్‌ పురుగులు (పెడిరోవ్‌ బీటిల్స్‌) కార్మికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.

భారత్ న్యూస్ విజయవాడ…తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో యాసిడ్‌ పురుగులు (పెడిరోవ్‌ బీటిల్స్‌) కార్మికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.

మొక్కల ఏరివేత, రవాణా సమయంలో ఈ పురుగులు శరీరంపై పాకడంతో వాటిని చేతితో నలిపేస్తే, వాటి నుంచి విడుదలయ్యే ‘పెడిరిన్‌’ అనే విషపదార్థం కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద, మంట వంటి అలెర్జీ సమస్యలు వస్తున్నాయి.

ఈ పురుగులు కుట్టకపోయినా నలిపితేనే ఇబ్బందులు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.

కంట్లో పడితే తీవ్ర ప్రమాదం ఏర్పడి చూపుపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు…..