షాద్ నగర్ లో తెలంగాణ అమరవీరుల స్థూప ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా

భారత్ న్యూస్ వరంగల్…షాద్ నగర్ లో తెలంగాణ అమరవీరుల స్థూప ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా

తెలంగాణ అమరవీరుల స్థూపం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయడం జరిగిందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం, జనార్ధన్ కన్వీనర్ బాలరాజ్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ మరియు గోర్ల రాము ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఈనెల 28, 2026 ఆదివారం ప్రారంభోత్సవం జరుగుతుందని గతంలో తెలియజేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాలవల్ల, స్థూపం నిర్మాణము పూర్తికానందువల్ల వాయిదా వేయడం జరిగింది.

స్థూపం నిర్మాణం పూర్తి అయిన తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీ వీర్లపల్లి శంకరన్న గారితో చర్చించిన తర్వాత ఎప్పుడు ప్రారంభం జరుగుతుందో తేదీని తెలియజేయడం జరుగుతుందని జేఏసీ నాయకులు తెలియజేశారు..