భారత్ న్యూస్ హైదరాబాద్ …గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ పేరుతో భారీ మోసం
250 మంది ఉద్యోగులతో ఒక్కొకరి వద్ద రూ.2 లక్షలు వసూలు చేసి కంపెనీ క్లోజ్
ఎఫ్ఐఆర్ నమోదైనా యదేచ్చగా బయట తిరుగుతున్న కంపెనీ యాజమానులు
గచ్చిబౌలిలోని వాసవి స్కై సిటీ బిల్డింగ్‌లో 8వ ఫ్లోర్‌లో సెప్టెంబర్ 2025లో RM1 కోడర్స్ హబ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అనే పేరుతో స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టిన రాము, జయంత్

కన్సల్టెన్సీల ద్వారా బ్యాక్‌డోర్ ఉద్యోగాల అంటూ ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేసి మొత్తం 250 మందిని రిక్రూట్
ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుండే జీతాలు చెల్లించకుండా మేము స్టార్టప్ కంపెనీ అని, ప్రాజెక్టులు వస్తున్నాయని, కొన్నాళ్ళు ఓపిక పట్టండి, పెండింగ్ జీతాలన్నీ ఒకేసారి జమ చేస్తామని నమ్మించిన యాజమాన్యం
2026 జనవరి నాటికి కూడా ఒక్క రూపాయి జీతం ఇవ్వకపోవడంతో ఉద్యోగులు నిలదీయగా.. అకస్మాత్తుగా ఆఫీసును మూసివేసి పరారైన నిందితులు
నిందితుడు రాము మామిడిపై ఉద్యోగులు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు
కొంతకాలం ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకొని, ఇప్పుడు మళ్లీ యదేచ్చగా రోడ్ల మీద తిరుగుతున్న నిందితులు రాము మామిడి, జయంత్ కుందేటి, రాము తండ్రి మామిడి కనకయ్య
నిందితులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితుల ఆవేదన