అలిపిరి చెక్పోస్ట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్

భారత్ న్యూస్ తిరుపతి…..అలిపిరి చెక్పోస్ట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్

వారాంతం సందర్భంగా తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అలిపిరి చెక్పోస్ట్ వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా కనిపించింది. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు భారీగా చేరడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, అధికారులకు సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.