కుటుంబం అనుమానాస్పద మృతి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

భారత్ న్యూస్ వరంగల్…కుటుంబం అనుమానాస్పద మృతి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

తెలంగాణ :

నల్గొండ జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్ (20), కుమార్తె అక్సర (11) అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ నలుగురిని అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. సుల్తాన్ మృతదేహంపై 6 చోట్ల, హసీనాకు 7 చోట్ల, కుమార్తె అక్సరకు 9 చోట్ల, ముజమిల్ కు ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది.

ఈ హత్యలు ప్రొఫెషనల్ కిల్లర్లే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులకు సంబంధించిన ఆధారాలు ఇంకా లభించలేదు.