పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

భారత్ న్యూస్ వరంగల్…పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

వరంగల్ :::ఆహార పదార్థాల నాణ్యతలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. SRR తోట సమీపంలోని ఓ… కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడంతో వినియోగదారుడు షాక్కు గురయ్యారు. ఇంటికి వెళ్లి ప్యాకెట్ కట్ చేయగా అందులో ఎలుక పిల్ల రావడంతో ఆయన ఆందోళన చెందారు. వెంటనే దుకాణానికి వెళ్లి నిలదీయగా వాగ్వాదం జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.

ప్యాకెట్లో ఎలుక.. తనిఖీలు

బాధితుడు రఘునందన్ ఫిర్యాదు మేరకు పెరుగు తయారీ కంపెనీకి చెందిన ఎలుక వచ్చిన బ్యాచ్ ప్యాకెట్లను సీజ్ చేసినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి తెలిపారు. ఎలుక వచ్చిన ప్యాకెట్లోని పెరుగును సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపామన్నారు. పెరుగు తయారీ కంపెనీకి నోటీసులు జారీ చేస్తామన్నారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.