మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భూ స్కామ్‌,కుటుంబ సభ్యుల పేరిట వందల ఎకరాలు కొనుగోలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భూ స్కామ్‌,కుటుంబ సభ్యుల పేరిట వందల ఎకరాలు కొనుగోలు

🔹బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌కు సంబంధించిన భారీ భూ కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. గత రెండేండ్లలో ఉజ్జయిని, దాని పరిసర ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు, వారికి సంబంధించిన కంపెనీలు 137 ప్లాట్ల ద్వారా కనీసం 168 ఎకరాల భూమిని కొనుగోలు చేశాయని ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ జరిపిన పరిశోధనలో వెల్లడైంది.

🔹 సుమారు రూ. 45 కోట్ల విలువైన ఈ కొనుగోళ్లలో తదనంతర కాలంలో ప్రభుత్వ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగమైన గ్రామాలు, ప్రదేశాలు, కొత్త రోడ్లు, హైవే అలైన్‌మెంట్లు, ఉజ్జయిని మాస్టర్‌ ప్లాన్‌ 2035 కింద ప్రతిపాదించిన మార్పులు వంటివి ఉన్నాయని పత్రిక కథనం పేర్కొన్నది. ఈ మాస్టర్‌ ప్లాన్‌ 2023 మేలో విడుదలైంది. ఈ అక్రమ భూ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ మాత్రమే కాకుండా ఆయన భార్య సీమా యాదవ్‌, కుమారుడు వైభవ్‌ యాదవ్‌, కోడలు షాలినీ యాదవ్‌, సోదరులు నారాయణ్‌, నంద్‌లాల్‌ యాదవ్‌, సోదరి కళావతి యాదవ్‌, మేనల్లుడు అభయ్‌ యాదవ్‌, అలాగే దగ్గరి బంధువులైన గోవింద్‌, నీలేష్‌ యాదవ్‌లతో కూడిన పెద్ద బంధువర్గం కూడా భాగమై ఉంది.