జులై 31 నాటికి ఎన్నికల జాబితా ముద్రిస్తాం: ఆర్వీ కర్ణన్‌

భారత్ న్యూస్ హైదరాబాద్ … 31 నాటికి ఎన్నికల జాబితా ముద్రిస్తాం: ఆర్వీ కర్ణన్‌

జులై 31 నాటికి ఎన్నికల జాబితా ముద్రిస్తామని జీహెచ్​ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 20 వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్‌ 1 న ఓటర్ల తుది జాబితా ముద్రిస్తామని తెలిపారు. సర్ కింద దాదాపు 22 లక్షల ఓటర్లకు పైగా మ్యాపింగ్‌ పూర్తయ్యిందని ప్రకటించారు. మరో 25 లక్షల ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి చేయాల్సి ఉందన్నారు. సర్‌ ప్రక్రియలో బీఎల్‌వోలతో పాటు అన్ని రాజకీయ పార్టీల తరఫున బీఎల్‌ఏలు ఉంటారని తెలిపారు.