ఎస్‌బీఐపై తెలంగాణ సర్కార్ కఠిన నిర్ణయాలకు సిద్ధం

తెలంగాణ :

భారత్ న్యూస్ వరంగల్…ఎస్‌బీఐపై తెలంగాణ సర్కార్ కఠిన నిర్ణయాలకు సిద్ధం

తెలంగాణ :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎస్‌బీఐలోని ప్రభుత్వ లావాదేవీలను నిలిపివేసి, సుమారు రూ.5-6 వేల కోట్ల నిధులను ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది. కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్లను ఇతర బ్యాంకులకు తరలించే ఆలోచనలో ఉంది. కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల ఫిక్స్‌డ్ డిపాజిట్లను బదిలీ చేయాలని, ఎస్‌బీఐకి ఉన్న లీడ్ బ్యాంకు హోదాను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జూన్ 22, 23 తేదీల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని, ఆర్థికమంత్రితో భేటీ అయి, రాయదుర్గం భూముల విషయంలో ఎస్‌బీఐ వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నారు.