AMMA అధ్యక్షురాలు శ్వేతామీనన్ రాజీనామా

భారత్ న్యూస్ అనంతపురం..AMMA అధ్యక్షురాలు శ్వేతామీనన్ రాజీనామా

మలయాళ చిత్ర నటీనటుల సంఘం ‘అమ్మ’ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. ప్రధాన కార్యదర్శి కుకూ పరమేశ్వరన్‌ సమర్పించిన వార్షిక నివేదికలోని ఆదాయ-వ్యయాల్లో స్పష్టత లేదని ఆరోపణలు రావడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షురాలు శ్వేత మేనన్‌తో పాటు 17 మంది కార్యవర్గ సభ్యులు ఆదివారం రాజీనామా చేశారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తుల చేతికే సంఘాన్ని అప్పగించే ప్రయత్నం జరుగుతోందని, తాము కీలుబొమ్మలుగా మారడానికి సిద్ధంగా లేమని శ్వేత మేనన్‌ అన్నారు. కొత్త నాయకత్వం వచ్చేవరకు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.