సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. నేడు కోర్టుకు ఆధారాలు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. నేడు కోర్టుకు ఆధారాలు

ఆంధ్రప్రదేశ్ :

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కోర్టు ఆదేశాల మేరకు కృష్ణలంక పోలీసులు కేసుకు సంబంధించిన ముఖ్యమైన సాంకేతిక ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించనున్నారు. పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ హార్డ్‌డిస్కులు, డీవీఆర్‌లు, బ్యాకప్ డేటాను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందజేయనున్నారు. కేసు దర్యాప్తులో ఈ సీసీటీవీ ఫుటేజ్‌లు కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉండటంతో అందరి దృష్టి నేటి కోర్టు విచారణపై నిలిచింది. ఈ డిజిటల్ ఆధారాలు కేసు మిస్టరీని ఛేదించడంలో ఎంతవరకు సహకరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.