భారత్ న్యూస్ ఖమ్మం.3 రోజుల పాటు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ సేవలు బంద్….
తెలంగాణ : రాష్ట్రంలో ఈనెల 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్శాఖతో పాటు అనుబంధ ఆన్లైన్ సేవలు బంద్ కానున్నాయి. నిర్వహణ పనుల వల్ల మూడు రోజులపాటు రిజిస్ట్రేషన్ సేవలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ తెలిపారు.

రిజిస్ట్రేషన్ పనులు ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. జూన్ 29 నుంచి అన్ని సేవలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు….