భారత్ న్యూస్ రాజమండ్రి…ఈ నెల 11న కీలక ప్రకటన చేస్తా: టీవీకే తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడనే వార్తలపై నటుడు లారెన్స్…
టీవీకే తరఫున తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై నటుడు రాఘవ లారెన్స్ స్పందించారు. “ప్రస్తుతం నేను ‘బెంజ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా. ఈ నెల 10వ తేదీతో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. మా అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ నెల 11న (గురువారం) ఉదయం 9:30 గంటలకు ప్రకటిస్తా,” అని లారెన్స్ ‘X’లో పోస్టు పెట్టారు..
