ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచా వైజాగ్ బీచ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచా వైజాగ్ బీచ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవా తరహా బీచ్ షాక్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ పాలసీ కింద విశాఖపట్నం, చీరాల బీచ్లలో తాత్కాలిక బీచ్ ఫ్రంట్ బార్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు.

పర్యాటకులకు మద్యం, సీఫుడ్, స్నాక్స్ తదితర ఆహార పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి.

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీటి నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నారు.

దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించి రాష్ట్రంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది….