భారత్ న్యూస్ ఖమ్మం..హనుమకొండలో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ దాడి
హనుమకొండ జిల్లా యేనుగులగడ్డ ఇంద్రానగర్‌లో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డీసీఏ అధికారుల దాడి.
బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తి సరైన అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తింపు.
ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్న అధికారులు.
మొత్తం 41 రకాల మందులు, అందులో 35 రకాల ఇన్స్టిట్యూషనల్ సప్లై మందులు గుర్తింపు.
యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, బీపీ మందులు స్వాధీనం.
స్వాధీనం చేసుకున్న మందుల విలువ సుమారు రూ.10,000.
క్లినిక్‌లో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ల వినియోగం ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని డీసీఏ హెచ్చరిక.
మందుల నమూనాలను సేకరించి విశ్లేషణకు పంపిన అధికారులు.
కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీఏ వెల్లడించింది.

లైసెన్స్ లేని వ్యక్తులు, క్వాక్‌లకు మందులు సరఫరా చేసే డీలర్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక…..