భారత్ న్యూస్ విశాఖపట్నం..కిచెన్‌లో సచిన్ టెండూల్కర్ అదరగొట్టారు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈసారి కిచెన్‌లో తన ప్రతిభను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. సంప్రదాయ మరాఠీ వంటకం ‘ఉక్డిచే మోదక్’ (ఆవిరి కుడుములు) తయారు చేస్తున్న వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
వీడియోలో సచిన్ స్వయంగా మోదక్‌లు తయారు చేస్తూ కనిపించారు. క్రికెట్ మైదానంలోనే కాదు, వంటలోనూ తనదైన శైలి చూపించారంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్టర్ బ్లాస్టర్‌కు మరో కొత్త కోణం చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.