ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్ఎచ్ జట్టుకు అగ్నిపరీక్ష!

భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్:మే 22
ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకోవ డంతో క్రికెట్ అభిమా నుల్లో నరాల తెగే ఉత్కంఠ నెలకొంది, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో కూర్చున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూ రు ప్లేఆఫ్స్ రేసులో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది.

అయితే, ఎస్ ఆర్ హెచ్ టాప్ 2 పొజిషన్ పై కన్నేసింది, రాయల్ చాలెంజర్స్ బెంగళూ రు,18 పాయింట్స్,+1.1065 నెట్ రన్ రేట్ తో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది.. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 16 పాయింట్స్,+0.083 నెట్ రన్ రేట్ తో మూ డో స్థానంలో ఉంది, నేడు ఉప్పల్ స్టేడియం లో సన్రైజర్స్ హైదరా బాద్ జట్టు భారీ స్కోరు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది, ఒకవేళ ఆర్సిబి పై తక్కువ స్కోరుతో గెలిస్తే మూడో స్థానం తోనే సరి పెట్టుకోవా ల్సి ఉంటుంది..

అయితే ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు ప్రతి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూ రు ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచింది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో 9 విజయాలు, కేవలం 4 ఓటములతో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా దూసుకుపోతోంది. కేవలం పాయింట్లు మాత్రమే కాదు, +1.065 రన్ రేట్‌తో మిగతా జట్లకు అందనంత ఎత్తులో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణిస్తూ అభిమానుల మన సులు గెలుచుకుంది.

అయితే ఇప్పుడు మాత్రం సూపర్ ఫామ్ లో ఉన్న ఆర్సీబీ పై భారీ విజయాన్ని నమోదు చేయడం హైదరాబాద్ జట్టుకు అంత సులభం కాదు ఖచ్చితమైన ప్రణాళిక తో బరిలోకి దిగి అన్ని విభాగాల్లోను సత్తా చాటితేనే బెంగళూరు పై విజయం సాధించవచ్చునని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.