ఏపీలో 731 ఏఈ, ఈఓ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో 731 ఏఈ, ఈఓ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో మరో 731 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. విద్యుత్ శాఖలో 625 అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అలాగే దేవాదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాల్లో 106 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) పోస్టులను APPSC ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.వీటి గురించి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.