నారదునకు శివుడు ఉపదేశించిన భోజన నియమములు:

భారత్ న్యూస్ తిరుపతి…భోజన నియమములు 🌺

నారదునకు శివుడు ఉపదేశించిన భోజన నియమములు:

ఒక ముని నిరాహారిగా నుండును. ఒకడు గాలిని ఆహారముగా తీసికొనును. ఒకడు ఫలాహారము తీసికొనును. గృహస్థుడు యోగ్యకాలమునందు అన్నము దినును. ఇష్టమును బట్టి తీసికొను ఆహారములు వివిధములుగా నుండును.

బ్రాహ్మణులకు హవిష్యాన్నము ప్రశస్తము. నారాయణున కది నివేదించి తినవలెను. లేనిచో అది అభోజ్యమగును.

ఏకాదశినాడు భోజనము చేసినచో మహాపాపి యగును. కృష్ణ జన్మాష్టమినాడును, శ్రీరామనవమినాడును, మహాశివరాత్రినాడును భోజనము చేసినచో వాని పాపము రెట్టింపుగా నుండును.

ఉపవాసము చేయలేనివారు ఫలములనో, దుంపలనో, నీటినో గ్రహించవచ్చును.

ఆ మాత్రము ఉపవాసము చేయలేని దుర్బలులు విష్ణువునకు నివేదన చేసిన హవిష్యమును భుజించిన, ఉపవాస ఫలమును పొందుదురు.

గ్రామాంతరమునకు, దేశాంతరమునకు బోయినపుడు గృహస్థులు అటుకులు దేవునికి నివేదించి తినుట మంచిది. ఇదికూడ యతులకు బ్రహ్మచారులకు విధవాస్త్రీలకు నిషిద్ధము.

రాగిపాత్రలో పోసి పాలు త్రాగుటయు, ఎంగిలి ఆకులో నేతితో గూడిన అన్నము తినుటయు, పాలలో ఉప్పు వేసికొని త్రాగుటయు, గోమాంస భక్షణముతో సమానము,

కంచుచెంబులో పోసిన కొబ్బరినీరు, (రాగిపాత్రలో నైనను) రాగిచెంబులోని చెఱకురసము కల్లువంటి దగును. అది త్రాగరాదు.

లేచి నిలబడి ఎడమచేతితో మంచినీళ్ళు త్రాగినచో వాడు ధర్మహీను డగును.

పాడ్యమినాడు గుమ్మడికాయ తినరాదు. అది ధననాశనము చేయును.

విదియనాడు పొట్లకాయ తినరాదు. శత్రువృద్ధి చేయును.

తదియ, చవితి తిథులలో ముల్లంగి దుంప తిన్నచో ధననాశనము కలుగును.

పంచమినాడు దొండకాయ తిన్నచో అపనిందలు కలుగును.

షష్ఠినాడు వేపపూవు తిన్నచో పశుపక్ష్యాదులలో జన్మించును.

సప్తమినాడు తాటిపండు తిన్నచో రోగము వృద్ధియగును.

అష్టమినాడు కొబ్బరికాయ తిన్నచో బుద్ధి నశించును.

నవమినాడు ఆనపకాయయు, దశమినాడు తీగబచ్చలియు, ఏకాదశినాడు నల్లపెసలు, (తంబతీగ). ద్వాదశియందు పూతికయు, (నెమిలడుగు చెట్టు అని శబ్దరత్నాకరము)
త్రయోదశినాడు ములగకాయ (వార్తాకి) తిన్నచో పుత్రనాశనము కలుగును.

చతుర్దశినాడు మినుములతో చేసిన పదార్ధములు దినుట మహాపాపము.

పున్నమి అమావాస్యలందు మాంసము తినరాదు.

పూర్ణిమనాడు, సంక్రాంతినాడు (నెలకొక సారివచ్చు సంక్రమణములు) అమావాస్య – చతుర్దశి – అష్టమీ తిథులందును, శ్రాద్ధదినము లందును, వ్రతదినములలోను స్త్రీ సంగమము నిషేధము. తలకు నూనె రాచుకొనుట నిషేధము. పొట్ల, దొండకాయలు, మాంసము, కంచు పాత్రలో భోజనము నిషిద్ధములు.