భారత్ న్యూస్ విశాఖపట్నం..మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్
ఫైనల్ లొకేషన్ సర్వే రూట్ ను భారత రైల్వే శాఖ తన అట్లాస్ మ్యాప్ లో అప్ డేట్ చేసింది.
రూట్ ప్రకారం పెనుమూడికి దక్షిణంగా దివిసీమను కలుపుతూ రైల్వే బ్రిడ్జి రానుంది…ప్రపొజ్ చేసిన రైల్వేస్టేషన్లు-పెనుమూడి,అవనిగడ్డ,మోపిదేవి,చల్లపల్లి,మాజేరు,రుద్రవరం.
.
రేపల్లె-బాపట్ల రైల్వేలైన్ ఫైనల్ లొకేషన్ రూట్ మాత్రం సంగ్ధిదత ఉంది, భట్టిప్రోలు నుండి కనగాల,చెరుకుపల్లి,నిడుబ్రోలు ఉంటుందా లేక, రేపల్లె-బెల్లంవారిపాలెం-పెదపల్లి-గణపవరం-బాపట్ల ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
గతంలో RTES సర్వే చేసినప్పుడు రూట్ బెల్లంవారిపాలెం దగ్గరగా వెళ్ళింది, గతంలో ఆ RTES సర్వే రూట్లో రైల్వే స్టేషన్లు -నగరం రోడ్,నిజాంపట్నం రోడ్,గణపవరం. ఒక్క గణపవరం మినహా మిగతా రెండు కూడా ఊర్లకు దూరంగా ప్రపోజ్ చేశారు.

అలాగే ఇందుపల్లి-దుగ్గిరాలను కలుపుతూ నిర్మించబోతున్న విజయవాడ బైపాస్ రైల్వేలైన్ రూట్ కూడా అప్ డేట్ అయ్యింది. కంకిపాడు,నూతక్కి మీదుగా రూట్ వెళ్ళనుంది.