సీజ్ చేసిన వాహనాలకు ఈ నెల 29న బహిరంగ వేలం..

భారత్ న్యూస్ రాజమండ్రి…సీజ్ చేసిన వాహనాలకు ఈ నెల 29న బహిరంగ వేలం..

పల్నాడు జిల్లా రవాణా శాఖ అధికారి..

పల్నాడు: రికార్డులు సరిగా లేని మరియు పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూ రవాణా శాఖ అధికారులకు పట్టుబడిన వాహనాలకు ఈ నెల 29వ తేదీన బహిరంగ వేలంనిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) బి. సంజీవ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

​ముఖ్య సమాచారం..

​వేలం జరుగు తేదీ: మే 29, 2026.
​వేలం వేదిక: జిల్లా రవాణా అధికారి కార్యాలయం, పల్నాడు జిల్లా.

​వాహనాల వివరాలు..

ప్రస్తుతం నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మరియు మాచర్ల ఆర్టీసీ డిపోలతో పాటు పెదకూరపాడు పోలీస్ స్టేషన్‌లో మొత్తం 14 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి.​ఆటో రిక్షాలు: 02,​ట్రాక్టర్ ప్యాడీ క్లీనర్ వాహనాలు: 08,​మ్యాక్సీ క్యాబ్స్: 04 ​వాహన యజమానులకు చివరి అవకాశం ​సీజ్ చేయబడిన వాహనాల యజమానులు ఎవరైనా ఉంటే,వారు తమ వాహనాలకు సంబంధించి చెల్లించాల్సిన పన్నులు మరియు జరిమానాలను (Fine) చెల్లించి,మే 15వ తేదీలోపు తమ వాహనాలను విడిపించుకోవాలని అధికారులుసూచించారు.
​నిర్దేశించిన గడువులోగా విడిపించుకోని వాహనాలను మే 29న జిల్లా రవాణా కార్యాలయం వద్ద బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన వారు ఈ వేలంలో పాల్గొనవచ్చు.