మచిలీపట్నం–రేపల్లె కొత్త రైల్వే లైన్ 🚆

భారత్ న్యూస్ గుంటూరు…మచిలీపట్నం–రేపల్లె కొత్త రైల్వే లైన్ 🚆
₹2816 కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో కీలక ముందడుగు!

మచిలీపట్నం – రేపల్లె 47.60 కి.మీ కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ భారీ ప్రాజెక్ట్ ₹2816 కోట్ల వ్యయంతో సుమారు 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

🚆 ప్రాజెక్ట్ ముఖ్య విశేషాలు:
✔️ మొత్తం దూరం: 47.60 కి.మీ
✔️ అంచనా వ్యయం: ₹2816 కోట్లు
✔️ పూర్తి లక్ష్యం: 4 సంవత్సరాలు
✔️ 6 స్టేషన్లు, 70 వంతెనలు
✔️ 24 రైల్వే అండర్ బ్రిడ్జులు (RUBs)
✔️ ఆధునిక ఎలక్ట్రిఫికేషన్ & సిగ్నలింగ్ వ్యవస్థ

📍 స్టేషన్లు:
👉 జంక్షన్ స్టేషన్లు: మచిలీపట్నం, రేపల్లె
👉 క్రాసింగ్ స్టేషన్లు: చిన్నాపురం, అవనిగడ్డ, పెనుమూడి
👉 హాల్ట్ స్టేషన్: చల్లపల్లి

📈 ప్రయోజనాలు:
✔️ ప్రయాణికులకు వేగవంతమైన కనెక్టివిటీ
✔️ సరుకు రవాణాకు మెరుగైన సౌకర్యం
✔️ వ్యవసాయం, ఆక్వాకల్చర్ & పోర్ట్ కార్గోకు ఊతం
✔️ ట్రాఫిక్ రద్దీ తగ్గింపు
✔️ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదం

రైల్వే బోర్డు అనుమతితో ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తై, DPR సిద్ధమైంది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.