నేడు దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష

భారత్ న్యూస్ హైదరాబాద్…నేడు దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష

దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష నేడు నిర్వహించబడుతోంది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం అత్యంత కీలకమైన ఈ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

అభ్యర్థులకు ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారు.

అయితే, మధ్యాహ్నం 1:30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు పూర్తిగా మూసివేయబడతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు.

అందువల్ల, అభ్యర్థులు సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.