సముద్ర మట్టం కింద భారత్ జెండా

భారత్ న్యూస్ గుంటూరు…సముద్ర మట్టం కింద భారత్ జెండా

అండమాన్ నికోబార్ దీవుల్లోని స్వరాజ్ ద్వీప్‌లో 200 మంది డైవర్లు 60×40 మీటర్ల భారీ త్రివర్ణ పతాకాన్ని సముద్రం అడుగున ఆవిష్కరించి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు. భారత్‌లోనే అతిపెద్ద నీటి అడుగున జెండాగా ఇది చరిత్రకెక్కింది. ఈ అద్భుత ఘట్టం భారతీయ పర్యాటకాన్ని, ముఖ్యంగా స్కూబా డైవింగ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సందర్భం ఇది!