భారత్ న్యూస్ విశాఖపట్నం..రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై స్పష్టత – ప్రజలు ఆందోళన చెందవద్దు – ఎంపీ బాలశౌరి.
మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు మరియు పెట్రోలియం మరియు సహజ వాయువుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెంబర్ వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి ఏర్పడిన తాత్కాలిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రజలకు భరోసా కలిపిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసారు.
ఇండియన్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) ఛైర్మెన్ అరవిందర్ సింగ్ షాని, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఛైర్మెన్ సంజయ్ ఖన్నా మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఛైర్మన్ వికాస్ తతిదరులతో ఇప్పటికే తాను నేరుగా మాట్లాడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చి చరించడం జరిగింది అని, సరఫరా వ్యవస్థను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నందున ఈ రోజు, రేపటిలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది గనుక ప్రజలు ఎవరు ఆందోళ చెందవద్దు అని అన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడిన అనంతరం పరిస్థితి ఇప్పటికే సుమారు 90% పరిష్కారమైందని సమాచారం అందింది అని పేర్కొన్నారు.
రేపటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చి, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బ్బందులు కలగకుండా సాధారణ సరఫరా పునరుద్ధరించబడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. యుద్ధ పరిణామాల అనంతరం పెట్రోలియం మరియు డీజిల్ కు సంబంధించిన ప్రయివేట్ మరియు మైనింగ్ ఆపరేటర్లు కమర్షియల్ అవుట్ లెట్ల నుండి కాకుండా రిటైల్ అవుట్ లెట్ లనుండి ఆయిల్ ను పొందడంతో ఈ సమస్య తలెత్తినది అని అన్నారు. ప్రభుత్వం ఈ సమస్యను నివారించడానికి వాహనాలకు నిర్దిష్ట పరిమితిని ఏర్పాటు చేసి ఈరోజు సరఫరా చేయడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చిందని అన్నారు.
ప్రజలు అనవసరంగా ఆందోళన చెందకుండా, అపోహలకు లోనుకాకుండా సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరియు సంబంధిత సంస్థలు నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నాయి. త్వరలోనే పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుంది అని ఎంపీ బాలశౌరి వెల్లడించారు.
ఎంపీ కార్యాలయము,
మచిలీపట్టణం.