ఆధార్ అప్డేట్.. జూన్ 14 వరకు ఉచితం!

భారత్ న్యూస్ గుంటూరు…ఆధార్ అప్డేట్.. జూన్ 14 వరకు ఉచితం!

పదేళ్లు దాటిన ఆధార్ కార్డు వివరాలను అప్ డేట్ చేసుకునేందుకు UIDAI జూన్ 14 వరకు గడువు పొడిగించింది.

అప్పటివరకు myAadhaar పోర్టల్ ద్వారా చిరునామా, ఇతర వివరాలను ఉచితంగా మార్చుకోవచ్చు.

ఈ గడువు ముగిస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ ఆధార్ నంబర్, ఓటీపీతో లాగిన్ అయ్యి, సరైన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు.