కామాంధుడి బారినుంచి చిన్నారిని కాపాడిన యువకులు…

.భారత్ న్యూస్ హైదరాబాద్….కామాంధుడి బారినుంచి చిన్నారిని కాపాడిన యువకులు…

హైదరాబాద్‌లో ఏప్రిల్ 14న, యూసుఫ్‌గూడకు చెందిన జావిద్ అనే వ్యక్తి తొమ్మిదేళ్ల బాలికను లైంగికంగా వేధించబోగా, సెజల్, గణపతి, కాశీనాథ్, శ్రీనారాయణ అనే యువకులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. చిన్నారి తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో, ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానని నమ్మబలికి బాలికను తీసుకెళ్లి జావిద్ వేధించినట్లు తేలింది.

నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. యువకుల ధైర్యసాహసాలను సీపీ సజ్జనార్ ప్రశంసించారు….