.భారత్ న్యూస్ హైదరాబాద్….కదులుతున్న కారులో మంటలు.. క్షణాల్లో వాహనం దగ్ధం
తెలంగాణ : హైదరాబాద్లోని పెద్దగోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై కదులుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన ఆపి దిగిపోయాడు. అయితే క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో వోల్క్స్వాగన్ కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో అక్కడి ప్రాంతంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు….
