భద్రాదిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం!రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు!

భారత్ న్యూస్ ఖమ్మం…..భద్రాది జిల్లా:మార్చి 27
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శుక్రవారం జరిగే సీతారాముల కళ్యాణం మహోత్సవం శనివారం జరిగే శ్రీ రామ మహాపట్టాభిషేకం కోసం భద్రాది ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మిథిలా స్టేడియంలో శిల్ప కళాశోభిత కళ్యాణ వేదికపై సీతారాముల పరిణయ వేదిక శుక్రవారం వైభవంగా జరగనుంది, తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా భద్రాదికి చేరుకుంటున్నారు.

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో కాసేపట్లో లోక కల్యాణానికి సర్వం సిద్ధమైంది. భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అట్ట హాసంగా సాగుతున్నాయి. సీతారాముల కల్యాణానికి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. భక్తకోటి మురిసేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు.

రాములోరి కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా కన్నులారా వీక్షించి తరించేందుకు భక్తకోటి పెద్దఎత్తున తరలి వస్తున్నారు.సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, దంపతులు పట్టు వస్త్రా లు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజర వుతున్నారు. నవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ పండితులు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో ఎదుర్కొ లు అత్యంత కీలకమైన ఘట్టం. పెళ్లికి ముందు సీతారాములను ఎదురెదురుగా ఉంచి, ఇరు పక్షాల వారు పసుపు, కుంకుమలు, తాంబూ లాలు మార్చుకుంటూ, భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తారు.

కల్యాణ వేదికైన మిథిలా ప్రాంగణాన్ని సీతమ్మ పుట్టినిల్లయిన మిథిలా నగరంగా.. పక్కనున్న వైకుంఠ క్షేత్రం రామయ్య వెలసిన ప్రాంతంగా భావిస్తారు. అలాగే.. అర్చకులు భగవంతుని వంశ క్రమాన్ని, గోత్ర నామాలను చదువుతూ పెళ్లికి ముందు వధూవరుల పక్షాన వాదోపవాదాలు చేసుకునే ఈ ఎదుర్కోలు ఘట్టం అత్యంత ఆసక్తికరంగా సాగింది.

ఇదిలావుంటే, శ్రీరామ నవమి సందర్భంగా భద్రా చలంలో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 11గంటలకు రామాలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌ రెడ్డి శ్రీకారం చుట్టనున్నా రు. రూ.351కోట్లతో మొదటి విడత పనులకు శంకుస్థాపన చేయనున్నా రు. ఇప్పటికే రామాలయ అభివృద్ధికి రూ.586కోట్ల తో బృహత్తర ప్రణాళిక రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి దశ పనులను రూ.351కోట్లతో చేపట్టేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.