సముద్ర ప్రయాణం: కాకినాడ టు వైజాగ్ భీమిలి 45నిమిషాల్లోనే.. రూ.200 టికెట్!

భారత్ న్యూస్ విశాఖపట్నం..సముద్ర ప్రయాణం: కాకినాడ టు వైజాగ్ భీమిలి 45నిమిషాల్లోనే.. రూ.200 టికెట్!

ఆం ధ్రప్రదేశ్ తీర ప్రాంత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి ఇది ఆలంబనగా నిలవబోతోందా? అంటే అవుననే అంచనా వేస్తున్నారు. ఐఐటి మద్రాస్ స్టార్టప్ రూపొందించిన సీగ్లైడర్ సాంకేతికత అందుబాటులోకి వస్తే..

కాకినాడ నుండి వైజాగ్ లేదా భీమిలికి ప్రయాణం అత్యంత వేగంగా.. అతి తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. కోల్‌కతా నుండి చెన్నై వరకు సుమారు 1668 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రూ.600లతో.. 3 గంటల్లో చేరుకోగలిగే ఈ టెక్నాలజీ ఏపీ తీరప్రాంతానికి సరికొత్త రూపును ఎందుకు ఇవ్వదు అనేదే అందరి ఆలోచన.

ఈ సీగ్లైడర్లు విమానాల మాదిరిగా కాకుండా.. సముద్ర ఉపరితలానికి కేవలం 4 మీటర్ల ఎత్తులో వింగ్-ఇన్-గ్రౌండ్ (డబ్ల్యూఐజీ) ఎఫెక్ట్‌తో ప్రయాణిస్తాయి. దీనివల్ల గాలి రాపిడి తగ్గి ఇంధన వినియోగం భారీగా తగ్గుతుంది. కాకినాడ నుండి భీమిలి వరకు ఉన్న సుమారు 200 కిలోమీటర్ల లోపు దూరాన్ని ఈ వాహనంలో ప్రయాణిస్తే.. టికెట్ ధర రూ.200 కంటే తక్కువగానే ఇవ్వొచ్చని కూడా చర్చ సాగుతోంది. ఇది సామాన్య ప్రయాణికులకు ఒక వరం లా మారే వీలుంది.

ఈ ప్రాజెక్ట్ కేవలం రవాణాకే కాకుండా పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తు