సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు రూ.25 వేలు పరిహారం

…భారత్ న్యూస్ హైదరాబాద్….సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు రూ.25 వేలు పరిహారం

రూ.50 వేల వరకు డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు మాత్రమే పరిహారం

ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే

థర్డ్ పార్టీ ఉల్లంఘనల దృష్ట్యా బాధితులకు తాత్కాలిక ఉపశమనంగా పరిహారం అందించాలని ఆర్బీఐ కార్యాచరణ

డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు 5 రోజుల లోపు సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేస్తేనే పరిహారం

బాధితుడు పోగొట్టుకున్న మొత్తం సొమ్ములో గరిష్టంగా 85% లేదా రూ.25 వేలు.. ఇందులో ఏది తక్కువుంటే అది అందించాలని నిర్ణయం

రూ.25 వేలల్లో రూ.19,118 భరించనున్న ఆర్బీఐ, రూ.2941 భరించనున్న సంబంధిత ఖాతాదారుడి బ్యాంకు